HCU భూముల వేలం పాటను ఆపాలి.సిపిఎం నాయకులను అక్రమ అరెస్టులని నిర్బంధాలను ఖండించాలని సిపిఎం డిమాండ్

తేదీ.02.04.2025

HCU భూముల వేలం పాటను ఆపాలి.సిపిఎం నాయకులను అక్రమ అరెస్టులని నిర్బంధాలను ఖండించాలని సిపిఎం డిమాండ్

ద్యార్థులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలను కలుపుకొని దీర్ఘ కాల ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు

తాండూర్ అగ్నిజాల ప్రతినిధి :

తాండూర్ : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూములను కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయని వెంటనే ఆపాలని డిమాండ్ ప్రశ్నించిన విద్యార్థులు సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఏత్తివేయాలని సిపిఎం నాయకులు విద్యార్థుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాండూర్ లో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ* కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ గచ్చిబౌలిలోని 400 ఎకరాల యూనివర్సిటీకు సంబంధించిన భూములను ప్రభుత్వం వేలంపాటను తక్షణమే ఆపి విశ్వవిద్యాలయానికి భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు భూమిలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తే పర్యావరణం దెబ్బతింటుందని జీవ వైవిధ్యం నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్తులో నూతన భవనాలు వసతి గృహాలు కోర్సులు తదితర అనేక అవసరాలకు ఉపయోగపడే భూములను విశ్వవిద్యాలయానికే కేటాయించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు ప్రజల న్యాయమైన డిమాండ్ ను ఆలోచన చేయకుండా ప్రశ్నించిన విద్యార్థులను రాజకీయ పార్టీలను నిరంకుశంతో అణచివేస్తుందని విమర్శించారు యూనివర్సిటీకి సంబంధించిన భూముల పై ప్రభుత్వం అడుగుపెట్టి అర్హత లేదని అన్నారు భవిష్యత్తు లో విశ్వవిద్యాలయాలను పరిశోధన కేంద్రాలుగా మార్చి అభివృద్ధి చేయడం మానేసి యూనివర్సిటీలలోకి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులను ప్రోత్సహించడం ఏమిటి అని ప్రశ్నించారు ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని 400 ఎకరాల భూమి HCU కు అప్పగించాలని రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా అరెస్టు చేసిన సిపిఎం నాయకత్వాన్ని విడుదల చేసి విద్యార్థులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలను కలుపుకొని దీర్ఘ కాల ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తాండూర్ డివిజన్ కార్యదర్శి సీరియలా సిపిఎం నాయకులు వెంకటేష్ బాలస్వామి ధనియాలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *