రైతులకు ప్రయోజనకరంగా సహకార సంఘాలు

రైతులకు ప్రయోజనకరంగా సహకార సంఘాలు

 

పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి 

 

తాండూర్(పెద్దేముల్) : అగ్ని జ్వాలా ప్రతినిధి:

రైతు సేవా సహకార సంఘాలు రైతులకు ప్రయోజనకరంగా ఉంటాయని వికారాబాద్ జిల్లా పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.శనివారం పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి సభ్యులు రైతుల సమక్షంలోతీ ర్మానించారు. రైతులు రుణాలు సకాలంలో చెల్లించి సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.మరొకవైపు పాలకవర్గాన్ని ఆరు నెలలపాటు పొడిగించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ సి ఎస్ సి ఈ ఓ మురళీధర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.