డ్రాగన్‌ ఫ్రూట్‌ చేర్చుకుంటే..

డ్రాగన్‌ ఫ్రూట్‌ ఈ మధ్య బాగా ఫేమస్‌ అయ్యింది. డ్రాగన్‌ ఫ్రూట్‌ టేస్ట్‌, దీనిలోని పోషక విలువల కారణంగా చాలా మంది ఈ పండు తినడానికి ఇష్టపడుతున్నారు. చూడటానికి పింక్‌ కలర్‌ ఎట్రాక్టివ్‌గా ఉంటుంది. దీనిలోపల గుంజు.. తెల్ల రంగులో ఉంటుంది. దీని టేస్ట్‌ కొంచెం తాటి ముంజలులా ఉంటుంది . డ్రాగన్‌ ఫ్రూట్‌తో ఐస్‌ క్రీంలు, కేకులు, జెల్లీలు, సలాడ్స్‌ తయారు చేస్తారు. డ్రాగన్ ఫ్రూట్‌ను పిటాయా, స్ట్రాబెర్రీ పియర్ అని కూడా పిలుస్తారు. డ్రాగన్‌ ఫూట్‌ పోషకాల స్టోర్‌ హౌస్‌ అని చెప్పాలి. ఇందులో మీ శరీరానికి శక్తినిచ్చే ఫైబర్‌, ప్రొటీన్లు అధికంగా

ఉన్నాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ మెండుగా ఉంటాయి. విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. దీంతో పాటు బి1, బి2, బి3 విటమిన్లూ ఉంటాయి. తరచూ మన డైట్‌లో డ్రాగన్‌ ఫ్రూట్‌ చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నరూ