పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాతుల నాగు బాధ్యతలు స్వీకారం
తాండూర్ పట్టణ అధ్యక్షుడిగా బాతుల నాగుకు ఘన సన్మానం
తాండూరు, manasa news ప్రతినిధి తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన బాతుల నాగును INTUC తాండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు న్యాయవాది జిలాని, పట్టణ మాజీ అధ్యక్షుడు సయ్యద్ హబీబ్ లాల్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బాతుల నాగు కృషి చేయాలని సూచించారు. పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు చేరేలా పనిచేయాలని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కోసం అందరం కలిసి పనిచేస్తామని నాయకులు పేర్కొన్నారు.

