“గ్రాండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్

 

బర్త్‌డే వేడుకల్లో మెరిసిన రాజాసింగ్ అభిమానులు

రాజాసింగ్ జన్మదిన వేడుకలకు గొట్లపల్లిలో విశేష స్పందన

గొట్లపల్లిలో ఘనంగా ఎమ్మెల్యే రాజాసింగ్ జన్మదిన వేడుకలు

manasa news: ప్రతినిధి,పెద్దేముల్ 

గొట్లపల్లి గ్రామంలో ప్రజల మనసులు గెలుచుకున్న ప్రజానాయకుడు, హిందుత్వ వాదానికి ప్రతీక అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తలారి శ్యామ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ ప్రజలు భారీగా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.కార్యక్రమంలో తలారి రమేష్, రామ్ రెడ్డి, బాల్‌రాజ్, తలారి నరేష్, మోడీ నరసప్ప తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజాసింగ్ ధైర్యసాహసాలతో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకుడని, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు.ఇలాంటి నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని, ఆయనకు దీర్ఘాయుష్షు కలగాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.