జయంతి వేడుకలపై వివాదం – ఆందోళనకు సిద్ధమవుతున్న సంఘాలు
దళిత, మైనార్టీ సంఘాలకు ఆహ్వానం లేదు – ఎమ్మెల్యే సమాధానం కోరుతున్న నాయకులు
అంబేద్కర్ జయంతి వేడుకల్లో వివక్ష? తాండూర్‌లో రాజకీయ దుమారం
ఆహ్వానంలో విస్మరణపై వివాదం – మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు కోరిన సంఘాలు
manasa news ప్రతినిధి,తాండూర్ పట్టణంలోని పాత తాండూర్ పార్కులో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వివాదాస్పదంగా మారాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వంటి మహత్తర వేడుకల్లోనే దళిత మరియు మైనార్టీ సంఘాలను విస్మరించడం పట్ల వివిధ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహాబ్, కేవీపీఎస్, సీఐటీయూ, ఎంఆర్పీఎస్, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ హక్కుల సంఘాల ప్రతినిధులు ఉమ్మడిగా మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికే పరిమితి కాదని, సమాజంలోని అన్ని వర్గాల వారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడి జయంతి వేడుకల్లో దళిత, మైనార్టీ సంఘాలను భాగస్వామ్యం చేయకపోవడం వెనుక ఉన్న కారణాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

