*విద్యార్థుల సమస్యలు విన్న కౌన్సిలర్ – త్వరిత పరిష్కారానికి హామీ
*స్కూల్ అభివృద్ధికి ముందడుగు మహేశ్వరి భరోసా
*పిల్లల భవిష్యత్తు కోసం కృషి – సీతారాంపేట్లో ఘన సన్మానం
*అంగన్వాడి, ప్రైమరీ స్కూల్ సమస్యలపై స్పందించిన కౌన్సిలర్ మహేశ్వరి
తాండూర్manasa news ప్రతినిధి :మున్సిపాలిటీ 32వ వార్డు పరిధిలోని సీతారాంపేట్ అంగన్వాడి మరియు ప్రాథమిక పాఠశాలలో హృదయపూర్వక వాతావరణంలో కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల హెడ్మాస్టర్ ఉమాదేవి అంగన్వాడీ టీచర్ నిర్మల కలిసి 32వ వార్డు కౌన్సిలర్ మహేశ్వరి ని ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న పలు అభివృద్ధి అవసరాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కౌన్సిలర్ కి వివరించారు. విద్యాభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మహేశ్వరి సమస్యలను శ్రద్ధగా వినిపించి, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, పిల్లల భవిష్యత్తు కోసం కట్టుబడి పనిచేస్తున్న ప్రజా ప్రతినిధిగా మహేశ్వరి సేవలు అభినందనీయమని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యా రంగ అభివృద్ధి, చిన్నారుల సంక్షేమం కోసం ఆమె తీసుకుంటున్న చర్యలు ఆదర్శప్రాయమని వారు ప్రశంసించారు.

