ఖాళీ పోస్టులు భర్తీ చేసి అదనపు పనులు రద్దు

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ఐసిడిఎస్ అవసరం – అంగన్వాడీ యూనియన్

ఖాళీ పోస్టులు భర్తీ చేసి అదనపు పనులు రద్దు చేయాలని యూనియన్ డిమాండ్

తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ టీచర్స్ నిరసన

ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీలలోనే నిర్వహించాలని డిమాండ్

అగ్నిజ్వాలా ప్రతినిధి:తాండూర్

తాండూర్ : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆపీస్ దగ్గర నిరసన కార్యక్రమం ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు u బుగ్గప్ప మాట్లాడుతూ* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రీ పై మరి పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించాలి. విద్య బోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు ఇవ్వాలి. విద్యా వాలంటీర్లకు నియమించిన వేతనాన్ని వారికి అదనంగా చెల్లించాలి. ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రైవేటు స్కూల్స్ నడపడానికి అనుమతి ఇవ్వకూడదు. అదరపు పనులు రద్దు చేయాలి. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. రాష్ట్రవ్యాపిత పిలుపులో భాగంగా *వికారాబాద్ డీఈవో పీఎం విద్య, పోటీ సెంటర్ల కోసం ఈ నెల 1 నుంచి 9తొమ్మిది వరకు నిర్వహిస్తున్న కొత్తవారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ * ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వనికి అంగన్వాడి యూనియన్ ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు అందించే ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకం కాదు. ప్రీ ప్రైమరీ పీఎం విద్య పై నా రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం సరైనది కాదు. ఇది ప్రభుత్వ విద్యను బలపెత్తం చేయకపోగా, ప్రభుత్వంలో భాగమైన అతి ముఖ్యమైన ఆరు సంవత్సరాల లోపు పిల్లల మానసిక, శరీరక ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్న ఐసిడిఎస్ సమస్తను నిర్వీర్యం చేసేందుకు ఈ విధానం ఉంది. ఎందుకంటే ఆరు సంవత్సరాల లోపు పిల్లల కు కావాల్సింది. విద్య ఒకటే కాదు. విద్య కంటే కూడా పౌష్టికారం అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే 70% శారీరక, 90% మెదడు మానసిక అభివృద్ధి వయసులోనే జరుగుతుంది. వయసును బట్టి కావలసిన క్యాలరీల శక్తి గల పౌష్టికాహారం అందించే లక్ష్యంతో 50 సంవత్సరాల క్రితం ఐసిడిఎస్ పుట్టింది. ఆరు సంవత్సరాల లోపు పిల్లల జీర్ణశక్తిని పరిగణలోకి తీసుకొని ఈ ఆహారాన్ని ఐసిడిఎస్ సప్లై చేస్తుంది. ఈ పౌష్టికారాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆరు సంవత్సరాల లోపు పిల్లలలో శారీరక మానసిక ఎదుగుదల ఉండదు. ఎదుగుదల లేనప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్యను నేర్చుకునే తెలివితేటలు కూడా పిల్లలకు రావు. పైగా శారీరక మానసిక అభివృద్ధి జరగకపోతే జీవితాంతం శారీరక మానసిక అంగవైకల్యంతో ఈ పిల్లలు బాధపడవలసి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు తెలంగాణ భావితరాల అభివృద్ధికి ఆటగంగా మారుతుంది. అదే సందర్భంలో ఇంగ్లీష్ మీడియం విద్య అనేది ఇప్పుడు సమాజం యొక్క పరిస్థితులలో చాలా అవసరమని మేము భావిస్తున్నాము. అలా అని ఐసిడిఎస్ను నిర్వీర్యం చేయడం దీనికి పరిష్కారం కాదు. అలా చేస్తే ఒక డిపార్ట్మెంటు బలోపేతం కోసం, మరొక డిపార్టుమెంటును నాశనం చేయడమే అవుతుంది. ప్రభుత్వ విద్య బలపడాలంటే, ప్రైవేట్ విద్యను నిర్వీర్యం చేయాలి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రైవేటు స్కూల్స్ నడపడానికి అనుమతి ఇవ్వకూడదు ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించాలి. శారీరక మానసిక ఎదుగుదల పర్యవేక్షణతో పాటు ప్రీ ప్రైమరీ పీఎం విద్యను అందించడానికి కావలసిన విద్య ఆరవతతో పాటు అపరమైన అనుభవం ఉన్న అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ కు ఉంది అయితే ఈ విద్యకు ఆటంకంగా ఉన్న ఐసిడిఎస్ను సంబంధంలేని బిఎల్ఓ తదితర అదనపు పనులను వెంటనే రద్దు చేయాలి. కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు బాలమణి భేబి జయంతి రామంజమ్మ భాగ్యలక్ష్మి మాణిమల విజయలక్ష్మి సంధ్య లలిత వసంత అంగన్వాడీ టీచర్స్ ఆయలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *