చిన్నారుల కోసం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం

 

పిల్లల కోసం ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శరణు బసప్ప

కీర్తన–రాంచరణ్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అంగన్ వాడీకి బహుమతులు

అంగన్ వాడీ చిన్నారులకు లయన్స్ క్లబ్ సహాయం

గాంధీనగర్ అంగన్ వాడీ కేంద్రానికి చైర్లు, ర్యాక్ అందజేసిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప 

అగ్నిజ్వాలా ప్రతినిధి:తాండూర్

తాండూర్:లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప కూతురు కీర్తన రాంచరణ్ వివాహ వార్షికోత్సవం సందర్బంగా వార్డ్ నంబర్ 20,గాంధీనగర్ అంగన్ వాడీ కేంద్రానికి చైర్లు, ర్యాక్ లను అందజేశారు. లయన్స్ క్లబ్ తాండూర్ అధ్యక్షులు శరణుబసప్ప ఆధ్వర్యంలో అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు.. రానున్న రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు విసృతంగా చేపట్టనున్నట్లు వివరించారు. చైర్లు లేకచిన్న పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉండడంతో అంగన్ వాడి టీచర్ రాధ చెప్పడంతో.. అధ్యక్షులు శరణు బసప్ప స్పందించి .. పిల్లలకు చైర్లు, ర్యాక్ లను అంగన్ వాడీ కేంద్రానికి అందజేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి నటరాజ్, ట్రేజరర్ గౌరీ శంకర్, సల్లా దామోదర్, ఓం ప్రకాష్ సోమాని, వై. బసనప్ప, ఎల్.సంగప్ప, అంగన్ వాడీ ఆయా అనిత,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *