కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా...
పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్స్ విడుదల చేయాలి.
తెలంగాణా రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి ని కేటాయించాలి
పెండింగ్లో ఉన్న మిస్కాస్ పోటిక్ చార్జీలను విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా కమిటీ డిమాండ్
అగ్నిజ్వాలా ప్రతినిధి: తాండూర్
పెండింగ్ స్కాలర్షిప్ ఫీజురియంబర్స్ మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.అనంతరం ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజుకుమార్ గౌడ్,అక్బర్ లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావలసినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని,తెలంగాణా రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి నీ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అలాగే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ తో సంబంధం లేకుండా విద్యార్థులు పై చదువులకు వెళ్లేందుకు సర్టిఫికెట్లను ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న మిస్ కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటని అన్నారు.తక్షణమే విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా విద్యార్థులు పై చదువులకు వెళ్లేందుకు సర్టిఫికెట్లను ఇవ్వాలని అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జూనియర్ కళాశాలకు భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కి సొంత భవనాన్ని నిర్మించాలి , సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు కట్టించాలని , ప్రభుత్వ పాఠశాలలో అక్షయపాత్ర ఆహారం సరిగ్గా ఉండడం లేదని దాని తొలగించి పాఠశాల వద్దనే వండి విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రాబోయే రోజుల్లో విద్యార్థులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చాకలి అనిల్ జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడు తేజ, జిల్లా కమిటీ సభ్యుడు రాకేష్, అభిషేక్ నాయకులు అనిల్, సమీర్ అఖిల్, మేఘమాల, , మానస తదితర విద్యార్థులు పాల్గొన్నారువిద్యార్థులు పాల్గొన్నారు

