క్యూ న్యూస్ కార్యాలయం పై దాడి చట్ట వ్యతిరేకం

క్యూ న్యూస్ కార్యాలయం పై దాడి చట్ట వ్యతిరేకం

 

రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే

 

తీన్మార్ మల్లన్న మాటలు బాధించి ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలా దాడులు చేయడం సిగ్గుచేటు

 

జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్

 

అగ్నిజ్వాలా ప్రతినిధి: తాండూర్

క్యూ న్యూస్ కార్యాలయం పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదని దాడికి ప్రేరేపించిన ఎమ్మెల్సీ కవితను జాగృతి కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ స్టేట్ అయిన మీడియాపై దాడి చేయడం నిరంకుశత్వం రాక్షసత్వానికి నిదర్శనమని దాడులతో ప్రశ్నించే గొంతులను ఆపలేరని వెనుకబడిన వర్గాల ప్రజల గొంతుకు గా ఉన్న క్యూ న్యూస్ కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు రానున్న రోజుల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమని రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలా భౌతికంగా దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు తీన్మార్ మల్లన్న మాటలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను బాధించి ఉంటే నిరసనల ద్వారానో చట్టపరంగానూ మరోరకంగా ఎదుర్కోవాలి తప్ప ప్రత్యక్ష దాడులు చేయడం చట్ట వ్యతిరేకమని రాజ్ కుమార్ అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *