ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు

అగ్ని జ్వాలా ప్రతినిధి :వికారాబాద్ 

వికారాబాద్: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వికారాబాద్ జిల్లా కేంద్రంలోఘనంగా నిర్వహించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోనిఅస్సాం బేకరి ఎదురుగా , సుభాష్ నగర్, అనంతగిరిపల్లి తదితర ప్రాంతాలలో బీజేపీవికారాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *