పరిగిలో బాబుజగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్
—నిస్వార్ధ ప్రజా సేవకుడు, దళిత సమాజానికి దిక్సూచి
—బిజెఆర్ జయంతి వేడుకల్లో బిజెపి నేతలు
వికారాబాద్ / పరిగి ప్రతినిధి
సంఘ సంస్కర్త, రాజకీయవేత్తగా, భారత దేశ ఉప ప్రధానిగా, దళిత వర్గం నుంచి ఉప ప్రధానిగా ఎదిగి దళిత వర్గానికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని సేవలు అందించారని వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలలో అయన పాల్గొని, బిజెఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ నిస్వార్ధ ప్రజా సేవకుడు అని.. దళిత సమాజానికి ఒక దిక్సూచిగా, కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా తన పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన తీరును ఈ సందర్భంగా ప్రశంసించారు. విద్యార్థులకు ఆయన జీవితం అనుసరణీయమని ప్రబోధించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, ఉపాధ్యక్షులు రాము యాదవ్, జిల్లా కార్యదర్శి యాదయ్య, జిల్లా కార్యదర్శి పెంటయ్య గుప్తా, వివిధ మండల అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, వికారాబాద్ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ విజయ్,మండల మాజీ బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , బీజేపీ జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ శ్రీశైలం , కిసాన్ మోర్చా టౌన్ అధ్యక్షుడు రమేష్, ఓబీసీ మోర్చా టౌన్ అధ్యక్షులు నరసింహులు , దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు రమేష్ , బిజెపి పరిగి మండల ప్రధాన కార్యదర్శి నాగేష్, బిజెపి నాయకులు రమేష్ , నరసింహులు, రాజు, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

