డాక్టర్ జగ్జీవన్ రామ్ భవనానికి 10 లక్షల నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

 

 

 

డాక్టర్ జగ్జీవన్ రామ్ భవనానికి 10 లక్షల నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

 

అగ్ని జ్వాలా ప్రతినిధి:తాండూర్

 

వికారాబాద్ జిల్లా తేదీ. 05-04-2025 శనివారం తాండూర్ పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో డాక్టర్ జగ్జీవన్ రామ్ భవనానికి 10 లక్షల నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి .డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతిని పురస్కరించుకొని తాండూర్ లోని క్యాంపు కార్యాలయంలో అలాగే రైల్వే స్టేషన్ పరిసరాల్లోని జగ్జీవన్ రామ్ భవన్లో ఆయన చిత్రపటానికి ప్రజా సంఘాల నేతలు నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన పట్నం మహేందర్ రెడ్డి గారు.    తాండూర్ పట్టణం లోని బాబు జగ్జీవన్ రామ్ భవనానికి దశలవారీగా అభివృద్ధికి నిధులు అందిస్తాం అన్నారు జగ్జీవన్ రామ్ ఒక వ్యక్తి కాదు సామాజిక శక్తి జగ్జీవన్ రామ్ బాటలో నడిచి సామాజిక న్యాయాన్ని సాధిద్దాం అన్నారు.ఇట్టి కార్యక్రమం లో రాష్ట్ర టిపిసిసి ప్రచార సమన్వయకర్త సీనియర్ నాయకుడు కరణం పురుషోత్తం రావు గారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పరిమళ రవీందర్, అబ్దుల్ కవి, ఎమ్మార్పీఎస్ నేతలు ఆనంద్, అంజిలప్ప, ఆశప్ప, సిఐటియు నాయకుడు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ యాలేటి శ్రీనివాస్, యువ నాయకులు కేశవులు,బిర్కెట్ రఘు,భగవాన్, శివానంద్ మడపతి, లేబర్ సెల్ తాండూర్ కన్వీనర్ అయూబ్ ఖాన్,మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *