ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు

 

పట్టణాన్ని పరిశుభ్రత కోసం పనిచేసే మున్సిపల్ కార్మికుల యొక్క బతుకులను ఆగం చేస్తున్నరు

ట్రాక్టర్ ఆటో నడుపుతున్న వారిని డ్రైవర్ గా ప్రభుత్వం వెంటనే గుర్తించాలని డిమాండ్

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు

 

తాండూర్ అగ్నిజాల ప్రతినిధి :

తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ citu ఆధ్వర్యంలో కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది జీవో 60 ప్రకారం కనీస వేతనం 26,000 అమలు చేయాలని ట్రాక్టర్ ఆటో నడిపే కార్మికులను డ్రైవర్స్ గా ప్రభుత్వం గుర్తించి పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం తాండూర్ లో ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే ఏర్పాటు చేయాలి సీఐటీయూ డిమాండ్

తాండూర్ :సిఐటియు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ యూనియన్ అధ్యక్షుడు కే శ్రీనివాస్ఆ  ధ్వర్యంలో తాండూర్ మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని ట్రాక్టర్స్ ఆటో డ్రైవర్స్ గా పని చేసే వారికి డ్రైవర్లుగా ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వమే లైసెన్సులు డ్రైవర్స్ గా పనిచేస్తున్న కార్మికులకు ఇప్పించాలని వినపత్రం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల బతుకులకు ఉద్యోగ భద్రత లేకుండా ప్రభుత్వ జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించకుండా డ్రైవర్స్ ని నియమించకుండా కార్మికులకు డ్రైవర్లకు ఒకే వేతనం ఇస్తున్నందుకు డ్రైవర్స్ శ్రమ దోపిడీకి గురైతున్నారు కార్మికులని ట్రాక్టర్ ఆటో నడుపుతున్న వారిని డ్రైవర్ గా ప్రభుత్వం వెంటనే గుర్తించాలని డిమాండ్ చేసారు తాండూరు మున్సిపల్ పట్టణాన్ని పరిశుభ్రత కోసం పనిచేసే మున్సిపల్ కార్మికుల యొక్క బతుకులను ఆగం చేస్తున్నరు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులు అరికట్టాలి తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీ లలో కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఎన్ఎంఆర్, ఫిక్స్ డే పే తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో చట్టబద్ధ రాజ్యాంగ పదవులలో ఉన్నవాళ్లు మున్సిపల్ కార్మికుల సేవల గురించి గొప్పలు మాట్లాడుతున్నారు కానీ మున్సిపల్ కార్మికుల జీవితాల గురించి మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు మానవ మల మూత్రాలను సైతం తొలగించి పట్టణాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు వేతనాల పెంపు ఉద్యోగ భద్రత గురించి మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రెండవ PRC లో కనీస వేతనం 26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు కార్మికుల ఆర్థిక సామాజిక గౌరవాన్ని పెంచే విధంగా ఉద్యోగ భద్రత కల్పించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు ఇచ్చే వేతనాలు కూడానెల నెల అందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు వేతనాలు సక్రమంగా అందక ఉద్యోగ భద్రత లేక అనారోగ్యాలతో కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని అన్నారు అత్యున్నత న్యాయస్థానాలు సైతం సమాన పనికి సమాన పనికి వేతనం ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు ఎనిమిది గంటల పది దినాలు అమలు కాకపోవడం వల్ల కార్మికులు అనారోగ్యాల పాలావుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని రెండవ PRC లో కనీస వేతనం 26,000 గా నిర్ణయించాలని పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ లు వెంటనే ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల నాయకులు

గౌరవ అధ్యక్షుడు కే రాములు వర్కింగ్ ప్రెసిడెంట్ జె నరేష్

ఉపాధ్యక్షులు బి శ్రీనివాస్ N వెంకటప్ప డి లక్ష్మణ్

ఎం వెంకటప్ సహకార్యదర్శిలు పి ప్రకాష్

ప్రధాన కార్యదర్శి కమిటీ సభ్యులుగా

డి వీరేశం ఏం ఆశప్ప బి నర్సిములు ఏం అశోక్ కే శంకర్ జె రాములు తదితరులు కార్మికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *