ఆశ వర్కర్స్ కి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుk చేయాలి                

ఆశ వర్కర్స్ కి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుk చేయాలి                

 

ఆశ వర్కర్స్ పైన యాలాల్ పి హెచ్ సి అధికారుల వేధింపులు అరికట్టాలి డిమాండ్ సీఐటీయూ

 

అగ్నిజాల ప్రతినిధి: తాండూర్:

సిఐటియు తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ యాలాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన తెలియజేసారు ఈ సందర్భంగా *సిఐటియుజిల్లా ఉపాధ్యక్షులు కే. శ్రీనివాస్ మాట్లాడుతూ* కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆశ వర్కర్స్కీ కనీస వేతనం 18000 వేలు ఉద్యోగ భద్రత ఈ ఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఆశ వర్కర్స్ పై యాలాల్ పి.హెచ్.సి అధికారుల వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే ప్రభుత్వము ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఫిబ్రవరి 9న జూలై 30న డిసెంబర్ 10న ఆరోగ్యశాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశాలు ధర్నా చేసిన సందర్భంగా నాటి కమిషనర్ ఆశా వర్కర్లకు 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చుల కింద 50,000 ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు ఇస్తామని, టార్గెట్స్ రద్దు చేస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని అన్నారు కానీ ఇచ్చిన హామీల నేటి వరకు అమలు చేయలేదని అన్నారు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినప్పటినుండి నేటి వరకు దశల వారీగా అధికార యంత్రాంగం ఎమ్మెల్యేలకు మంత్రులకు విజ్ఞప్తులు చేసిన ఆశ వర్కర్ల గోడు పట్టించుకోలేదని అన్నారు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల కు కనీసం ఆదివారం పండుగల సందర్భంగా సెలవులు కూడా ఇవ్వడం లేదని అన్నారు కావున ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 నిర్ణయించి ఇచ్చిన ఇతర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు యలాల్ ఆశ వర్కర్స్ మండల నాయకురాలు అంజమ్మ సులోచన లక్ష్మీ సరిత అరుణ అన్నపూర్ణ అనిత తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *