నారాయణపేట్ , మక్తల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్
తాండూర్: నారాయణపేట్ , మక్తల్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల ఇన్చార్జ్ గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పెద్దేముల్ మాజీ జడ్పిటిసి ధారాసింగ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయ కుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగానారాయణ పేట్, మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ కు పిసిసి అధ్యక్షులు పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

