మైనర్ డ్రైవింగ్ అరికట్టడం కోసం స్పెషల్ డ్రైవ్ 

 

మైనర్ డ్రైవింగ్ అరికట్టడం కోసం స్పెషల్ డ్రైవ్ 

 

తాండూర్ : అగ్నిజాల ప్రతినిధి :

తేదీ 29.01.2025 నాడు ఉదయం గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ నారాయణ రెడ్డి , ఐపీఎస్ మరియు శ్రీ బాల కృష్ణ రెడ్డి , DSP ఆదేశాల మేరకు తాండూర్ పట్టణంలోని జూనియర్ కాలేజీలు మరియు స్కూల్స్ వద్ద మైనర్ డ్రైవింగ్ అరికట్టడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. మోటార్ సైకిల్స్ నడుపుతున్న 18 సం లోపు ఉన్న 23 మంది పైన మరియు వారికి వాహనాలను నడపడానికి ఇచ్చిన వాహన యజమానుల పైన MV act నందు కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడం జరుగుతుంది.

G. సంతోష్ కుమార్,

ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,

తాండూర్ పోలీస్ స్టేషన్.