ఘనంగా వీడ్కోలు సన్మాన సభ
హాజరైన ప్రముఖులు
తాండూర్:అగ్ని జ్వాలా ప్రతినిధి
వికారాబాద్ జిల్లా యాలాల మండలం యాలల మండల ఎంఈఓ గా బాధ్యతలు నిర్వహించిన సుధాకర్ రెడ్డి సార్ గారికి గురువారం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మరియు యాలల జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు సన్మాన సభను నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి సేవలు యాలాల ఎంతగానో చేయడం జరిగిందని కొనియాడారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూశారన్నారు ఉపాధ్యాయునిగా పనిచేసిన పాఠశాల నుండి హెచ్ఎం గా ప్రమోషన్ పొంది మండల విద్యాధికారిగా సేవలందించడం జరిగిందన్నారు యాలాల మండలం తో పాటు బషీరాబాద్ మండలాన్ని కూడా తన సేవలందించడం జరిగిందని అన్నారు నిబద్ధత నియంత లేకుండా విద్యార్థులకు వారి భవిష్యత్తును తీర్చినందుకు ఉపాధ్యాయుని తన కర్తవ్యాన్ని నిర్వహించినందుకు ఇంత పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కొనియాడారు ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యను అందించినప్పుడే జీవితంలో మర్చిపోలేని గుర్తింపు లభిస్తుందని అన్నారు ఏర్పాటుచేసిన సన్మాన సభలో విద్యార్థులు పాటలు నాట్య వృత్యాలు నిర్వహించి ఆకట్టుకునే విధంగా ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి పుష్పలీల మాజీ జెడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్ మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాజీ వైస్ ఎంపీపీ అనంతయ్య ముదిరాజ్ పిఆర్టియు మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి తో పాటు వారి బృందం మరియు వివిధ సంఘాల నాయకులు పాల్గొని సుధాకర్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు.

