కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ.
రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్ చెక్కు అందజేసిన పైలెట్
తాండూర్ :అగ్నిజ్వాల ప్రతినిధి
పార్టీ నాయకులు కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. పెద్దేముల్ మండలం అడ్కిచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చాకలి నరసింహులు అనారోగ్యంతో మృతి చెందాడు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగిన నర్సింలకు 2 లక్షల ఇన్సూరెన్స్ మంజూరు కాగా దానికి సంబంధించిన చెక్కును పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఈరోజు నర్సింలు సతీమణి లక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్, సర్పంచ్ జనార్ధన్ రెడ్డి తదితరలు ఉన్నారు.

