B.C కుల సంఘాలన్నీ ఏకం కావాలి 

B.C కుల సంఘాలన్నీ ఏకం కావాలి 
~ బహుజన బీసీ కుల సంఘాలన్నీ ఏకం కావలసిన సమయం ఆసన్నమయింది.
~ E.W.S రిజర్వేషన్ అనైతికం.
~ ఓట్లు మావి సీట్లు మీవా?
~ తాండూరు ఎమ్మెల్యే సీటు భవిష్యత్తులొ బీసీలదే.
~ నాయవాది గోపాల్ B.C కుల సంఘాల ఐక్యవేదిక.
తాండూరు ప్రాంతంలో 85% ఓట్లు బీసీలవే. కానీ గత 30 సంవత్సరాల నుండి MLA సీటు మాత్రం ఓసిలది. ఆ తర్వాత జరిగే నామినేటెడ్ పోస్టులలో అగ్రవర్ణాలదే అధికారం. ఈ పరిస్థితి రాష్ట్రమంతా అమలులో ఉంది. 6% జనాభా ఉన్న అగ్రవర్ణాలకు 10% E.W.S రిజర్వేషన్ల. ఇది అన్యాయం అనైతికం. B. C ల కడుపు కొట్టి E.W.S రిజర్వేషన్లు అమలు. భవిష్యత్తులో తాండూరు MLA సీటు BC బిడ్డకే దక్కాలి. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో త్యాగంతా బీసీ బిడ్డలవే. అగ్రవర్ణాలు ఎవరు కూడా రక్తం చిందించలేదు. కానీ అధికారం మాత్రం అగ్రవర్ణాలదే. ఉద్యమాలు మావి పదవులు మీవా? తాండూరు ప్రాంతంలోని బీసీ కుల సంఘాలన్నీ ఏకమై ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలి. బీసీల సామాజిక కులగనన రిపోర్టును పబ్లిక్ ప్రజాక్షేత్రంలో పెట్టాలి. జీవో 29 వల్ల బీసీలకు తీరని నష్టం.బీసీలలో ఉన్న సమర్థ నాయకులు బయటకు రావాలిఐక్య ఉద్యమాలు నిర్మించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *