బుయ్యని కుటుంబంలో సంబరాలు

 

కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య సందడి చేసిన పుట్టినరోజు వేడుకలు

మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖుల సమక్షంలో ఘనంగా వేడుకలు 

బుయ్యని కుటుంబంలో ఆనందోత్సాహాలు

జన్వాడలో ఘనంగా విశ్వ ఆద్విక్ పుట్టినరోజు | సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదాలు

 బుయ్యని విశ్వ ఆద్విక్ 1st Birthday వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

manasa news ప్రతినిధి :జన్వాడలోని ఆర్య కన్వెన్షన్ హాల్‌లో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మనవడు, బుయ్యని శివకుమార్ రెడ్డి – కావ్య దంపతుల కుమారుడు బుయ్యని విశ్వ ఆద్విక్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారికి ఆశీర్వాదాలు అందించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిన్నారి విశ్వ ఆద్విక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయుష్షు, ఆరోగ్యం, అభివృద్ధి కలగాలని ఆశీర్వదించారు.ఈ పుట్టినరోజు వేడుకల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, నాయకులు, అధికారులు మరియు అభిమానులు పాల్గొని చిన్నారికి ఆశీర్వాదాలు అందించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.