మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఏవి

 

కార్మికుల సంక్షేమం కోసం పర్మినెంట్ ఉద్యోగాలు, సముచిత వేతనాలు కావాలి

తాండూర్ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి 

డ్రైవర్స్ కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు చేయాలని కార్మికులకు CITU డిమాండ్  

అగ్నిజ్వాలా ప్రతినిధి: తాండూర్

తాండూర్ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డ్రైవర్స్ కు కార్మికులకు యూనిపామ్ సబ్బులు నూనెలుబెల్లంగ్లౌజులుషూస్నాణ్యతతోకూడుకున్న సంవత్సరానికి సరిపడా మెటీరియల్ వస్తువులు మున్సిపల్ కార్మికులకు వెంటనే ఇవ్వాలనిడిమాండ్సీఐటీయుజిల్లాఉపాధ్యక్షుడు కేశ్రీనివాస్ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా తాండూర్ పట్టణంలో మున్సిపల్ లో ప్రజలకు సేవలు చేస్తున్న మున్సిపల్ వర్కర్లను పర్మినెంట్ చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడం తగదన్నారు. మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, పర్మనెంట్ చేసేదాకా కనీసం వేతనం 26,000 అమలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా ప్రభుత్వం కార్మికులను శ్రమదోపిడి చేస్తున్నదని విమర్శించారు.మున్సిపాలిటీలో పని చేస్తున్న కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరిస్తున్నదని విమర్శించారు.మున్సిపల్ కార్మికులకు కేటగిరీల వారి వేతనాలు చెల్లించాలని పోరాటం చేస్తున్న ప్రభుత్వ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మున్సిపల్ కార్మికులకు పిఎఫ్ ను కార్మికుల ఖాతాలో సక్రమంగా జమ చేయడం లేదని,ESI అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో పిఎఫ్ సక్రమంగా కార్మికుల ఖాతాలో జమ చేయడం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న యూనిఫామ్, సబ్బులు, నూనెలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.జిల్లా అధికార యంత్రాంగం స్థాయిలో ఉన్న సమస్యలను సైతం సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉంచడం సరి కాదన్నారు చనిపోయిన వారి కార్మిక కుటుంబాల్లో వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డ్రైవర్లకు కార్మికులకు కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్ citu తాండూర్ పట్టణ మున్సిపల్ వర్కర్స్ గౌరవాధ్యక్షుడుగా k రాములు వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ భాస్కర్ ఎం అశోక్ గోపి నాయక్ ముకుంద డి లక్ష్మణ్ మల్లప్ప రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *