భాషీరాబాద్ లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
ఉత్సవాలలో పాల్గొన్న మాజీ (ఎంపీపీ) కరుణ అజయ్ ప్రసాద్
మాజీ సర్పంచ్ పూడూర్ ప్రియాంక శ్రవణ్ కుమార్
అగ్ని జ్వాల ప్రతినిధి: బషీరాబాద్
ఆదివారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవాలు వైభోగంగా జరిగాయి. కళ్యాణోత్సవాలను ఉదయం నుంచి శుభలగ్న సుమూహూర్తములో వేద పండితుల మంత్రోచ్చరణల మద్య సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. నీలమేఘశ్యాముడు జనకుని కూతురు సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేస్తుండగా తరలివచ్చిన అశేష భక్తజనవాహిని తన్మమయంతో పులకించి జయ జయ ద్వానాలు చేశారు.

