జయశంకర్ భూపాలపల్లి జిల్లా అగ్ని జ్వాలా ప్రతినిధి
ఉమ్మడి రేగొండ గోరి కొత్త పెళ్లి మండలము చిన్నకోడపాక గ్రామంలో సిపిఐ వరంగల్ ఉమ్మడి జిల్లా జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పైండ్ల మల్లయ్య గారి మూడవ వర్ధంతి కార్యక్రమానికి సిపిఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కామ్రేడ్ పైండ్ల మల్లయ్య గారి స్మారక స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు కామ్రేడ్ పైండ్ల మల్లయ్య గారు భారత కమ్యూనిస్టు పార్టీకి ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు పార్టీ ఇచ్చిన పిలుపు భాగంగా దున్నే వాడికి భూమి అనే నినాదంతో గ్రామంలో పెద్ద ఎత్తున పేదలకు సుమారు 400 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం భూ పోరాటానికి నాయకత్వం వహించి పేదలకు పట్టాలు ఇప్పించారు అంటరానితనానికి వ్యతిరేకంగా కుల నిర్మూలన కార్యక్రమాల్ని నిర్వహించి సహపంక్తి భోజనాల్ని ఏర్పాటుచేసి సమాజంలో అందరూ ఒకటే అని భావజాలాన్ని పెంపొందించారు కమ్యూనిస్టు భావజాలాన్ని పెంపొందించడంలో ముందున్నాడు గ్రామ అభివృద్ధికి గ్రామ సర్పంచిగా తన హయాంలో ఎనలేని సేవలందించాడు పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషిచేసి పరకాల ప్రాంతం పార్టీ నిర్మాణ బాధ్యులుగా సేవలందించారు ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవలసిన అవసరం ప్రతి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త బాధ్యత అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు మామిడాల సమ్మిరెడ్డి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుంటి చంద్రమౌళి కుమార్ రెడ్డి తర్వాతసిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి శాంతి కుమార్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నారపు రాజేందర్ సిపిఐ రేగొండ మండలం కార్యదర్శి పెంట రవి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కనకం రమేష్ యూత్ నాయకులు బండారి రవి సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి పప్పుల సారయ్య మార్క రామన్న బొట్ల చంద్రమౌళి గుండు సమ్మయ్య యాద బిక్షపతి జితేందర్ కుటుంబ సభ్యులు క్రాంతి కుమార్ వడ్డేపల్లి రఘు మడి కంటి నరసయ్య అరుణ కరుణ షణ్ముఖ దత్త కార్తికేయ నాగేష్ దత్త వినీత అనిత పాల్గొన్నారు.

