నాగారం నరసింహులు జీవితం తాండూరు ప్రజలకు ఆదర్శం 

  1. కురువ సంఘం ఆధ్వర్యంలో నాగారం నరసింహులు  సంతాప సభ
  2. . నాగారం నరసింహులు జీవితం తాండూరు ప్రజలకు ఆదర్శం 

. జీవితకాలమంతా బీసీల ఐక్యత కోసం పోరాడినటువంటి వ్యక్తి

. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం జీవితాంతం కట్టుబడి ఉన్న వ్యక్తి

 

తాండూరు:అగ్నిజ్వాల ప్రతినిధి :పట్టణంలోని గంజ్ అసోసియేషన్ హాల్లో కురువ సంఘం ఆధ్వర్యంలోసంతాప సభ నిర్వహించరూ ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన సంఘం అధ్యక్ష కార్యదర్శులు సంఘం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కడవరకు పాటుపడిన వ్యక్తి బీసీలకు రాజ్యాధికారం రావాలని జీవితమంతా పోరాటం చేసిన వ్యక్తి అని సంఘం గౌరవ అధ్యక్షులు న్యాయవాది గోపాల్ తెలిపారు. తాండూర్ గంజి యొక్క ఆస్తులు పెరగడానికి నర్సింలు సెట్ కారణమని సంఘం నాయకులు వీరేశం గారు తెలిపారు. తన జీవితకాలంలో తనలాంటి ఎంతోమంది నాయకులను తయారు చేసిందని సంఘం ఉపాధ్యక్షులు పూజారి పాండు తెలిపారు. అజాతశత్రువు మృదుస్వభావి తాండూరు ప్రజలలో చిరకాలంగా నిలిచే వ్యక్తి అని కార్యదర్శి ఇందూరు మల్లేశం తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలోసంఘం సీనియర్ జింగుర్తి నరసింహులు, టౌన్ అధ్యక్షులు మరాటి నరసింహులు తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *