పవిత్ర బంధానికి రాఖీ పౌర్ణమి

వార్డు 7 ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ ఇర్షాద్

రాఖీ పండుగ ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నింపాలి: ఇర్షాద్

రాఖీ బంధం.. ప్రేమానురాగాలకు ప్రతీక: కౌన్సిలర్ ఇర్షాద్

తాండూర్: manasa news :రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వార్డు నెంబర్ 7 లో ప్రజలతో పాటు తాండూర్ పట్టణ ప్రజలందరికీ కౌన్సిలర్ ఇర్షాద్ హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇర్షాద్ మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమానురాగాలకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాఖీ అనే పవిత్రమైన బంధం ప్రతి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, ఐక్యతను పెంపొందించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా తనకు రాఖీ కట్టి సోదరభావాన్ని చాటిన అక్కా చెల్లెళ్లందరికీ కౌన్సిలర్ ఇర్షాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాఖీ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ప్రేమానురాగాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.