విద్యార్థులపై ఆప్యాయత..

 

విద్యార్థుల పట్ల ఆప్యాయత.. సంక్షేమంపై బాధ్యతాయుతమైన శ్రద్ధ

విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ.. నవీన సంతోష్ గౌడ్‌కు అభినందనలు

 

తాండూర్.manasa news :గాంధీనగర్: విద్యార్థుల సంక్షేమం, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ స్థానిక కౌన్సిలర్ ఆర్. నవీన సంతోష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఆర్. సంతోష్ గౌడ్ ముందుకు సాగుతున్నారని స్థానికులు అభినందించారు.గాంధీనగర్ వార్డు నంబర్ 20లోని ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన వారు విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి, మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచి, పాఠశాలలోని సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమకు అందుతున్న భోజనం సంతృప్తికరంగా ఉందని, పాఠశాలలోని సదుపాయాలు బాగున్నాయని తెలిపారు.విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా పాఠశాలను సందర్శించడం, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అవసరమైన సదుపాయాలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తామని నాయకులు తెలిపారు.పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలతో పాటు విద్యార్థుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న సంతోష్ గౌడ్ సేవా దృక్పథాన్ని పలువురు అభినందించారు.