రాజ్యాంగ విలువలు ప్రజా జీవితంలో భాగం కావాలి

రాజ్యాంగ విలువలు ప్రజా జీవితంలో భాగం కావాలి

 

. విద్యార్థులకు పాఠశాలల్లో రాజ్యాంగ విలువలు బోధించాలి.

. ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు రాజ్యాంగ విలువలతో ప్రజలకు ఆదర్శంగా నిలవాలి

 

. న్యాయవాదులు రాజ్యాంగ స్పూర్తితో పని చేయాలి

 

తాండూర్:అగ్నిజ్వల ప్రతినిధి : ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం అనగా సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యాంగాన్ని తయారుచేసి 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఆ తర్వాత 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. రాజ్యాంగ విలువలు ప్రచారం చేయడానికి మరియు ప్రజల్లో స్ఫూర్తి నింపడానికి ఈరోజు మనం జరుపుకుంటాం. పౌరుల మధ్య న్యాయము సమానత్వము స్వేచ్ఛ మరియు దేశభక్తి జాతి సమగ్రత ప్రజాస్వామ్యం యొక్క ఆవశ్యకతను ప్రజలందరు గుర్తించుకోవాలి.

 ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ birth అనివర్సరీ ఈ సందర్భంగా రాజ్యాంగ రచలో అంబేద్కర్ చేసిన త్యాగము కృషిని కూడా స్మరించుకోవాలి. భారత రాజ్యాంగం పటిష్టంగా ఉంది కాబట్టే ఈరోజు ప్రజలందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవితాలను కొనసాగిస్తున్నారు. రాజ్యాంగ పీఠికను మార్చే మనువాదుల కుట్రలను సుప్రీంకోర్టు తిప్పికొడుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. భారతదేశం ఒక లౌకిక రాజ్యంగా కొనసాగాలని మనమందరం ఆశిద్దాం అని k గోపాల్ న్యాయవాది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *