తాండూరు పట్టణంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
శివాజీ చౌక్ నుండి మల్ రెడ్డి పల్లి వరకు రూ. 2.08 కోట్లతో ఆరు వార్డుల ప్రజలకు మేలు జరిగే విధంగా నూతన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
అనంతరం మీడియాతో మాట్లాడుతూ…
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మున్సిపల్ పరిధిలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులను దశల వారిగా పూర్తి చేస్తామని అన్నారు.
మొదటగా ఎక్కువ మొత్తంలో ఇబ్బందులకు గురి అవుతున్న ప్రాంతాలను గుర్తించామని అందులో భాగంగానే ఈ రోజు మల్ రెడ్డి పల్లి రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు.

