తైక్వాండో లో .గోల్డ్ మెడల్ సాధించిన వైష్ణవి

తైక్వాండో లో .గోల్డ్ మెడల్ సాధించిన వైష్ణవి

 

అభినందించిన మాస్టర్ మనోహర్..

 

తాండూర్: అగ్నిజ్వాల ప్రతినిధి :ఇటీవల గోవాలో నిర్వహించిన తైక్వాండో విఫా జీవిన్ ఇండియా ఓపెన్ ఇంటర్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్
పోటీలలో – -2024లో కే.వైష్ణవి గోల్డ్ మెడల్ సాధించారు. మాస్టర్లు పవన్ తేజ, కుశాల్
సీనియర్ మాస్టర్ మనోహర్ వద్ద ప్రతినిత్యం శిక్షణ తీసుకుంటూ .. ఇటివల నిర్వహించిన తైక్వాండో పోటీలలో వైష్ణవి గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఆమె తల్లితండ్రులు శశికళ కే శ్రీనివాస్ తో పాటు పలువురు అభినందించారు.ఈ సందర్బంగా మాస్టర్ మనోహర్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. ఇటువంటి వాటిని నివారించేందుకు తైక్వాండో మార్శల్ ఆర్ట్స్ ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్యంగా బాలికలు తనను తాను రక్షించేందుకు ఎంతగానో వీలుగా ఉంటుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *