సేవాలాల్ మహారాజ్

సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణానికి సహకరిస్తాం : మహేందర్ రెడ్డి*  సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణానికి సహకరిస్తాం : మహేందర్ రెడ్డి
పెద్దెముల్:అగ్నిజ్వల ప్రతినిధి 
ఓమ్లా నాయక్ తండాలో నిర్మిస్తూ, అర్ధాంతరంగా నిలిచిపోయిన సేవాలాల్ మహారాజ్ దేవాదాయ నిర్మాణానికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని  తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు అన్నారు.ఓమ్లా నాయక్ తండాలో పర్యటించిన మహేందర్ రెడ్డిని గ్రామస్తులు కలిసి దేవాలయ నిర్మాణ ప్రాంతానికి నాయకులు గేమియా నాయక్ మాజీ సర్పంచ్ రిక్కీ బాయ్ డిప్యూటీ సర్పంచ్ రవి చౌహన్ తదితరులుతీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా గతంలో మంత్రిగా మహేందర్ రెడ్డి ఉన్న సందర్భంలో సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని నిర్మించేందుకు సహకరించారని గ్రామస్తులు గుర్తు చేస్తూ అప్పటినుంచి దేవాలయ నిర్మాణం ఆర్థిక పరిస్థితులు సరిగా లేక అర్ధాంతరంగా ఆగిపోయాయని వివరించారు. స్పందించిన మహేందర్ రెడ్డి ఆలయ నిర్మాణానికి తన వంతుగా సహకరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలని సూచించారు.
కార్యక్రమం లో మాజీ డీసీసీబీ చైర్మన్ పి. లక్ష్మారెడ్డి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డివై నర్సిములు, మారేపల్లి మాజీ సర్పంచ్ బల్వంత్ రెడ్డి, నారాయణ్ గౌడ్, మంబాపూర్ మాజీ ఎంపీటీసీ యాలేటి శ్రీనివాస్, బోయిని శ్రీనివాస్, బీదర్ రాజశేఖర్ అబ్దుల్ ఖవి యువ నాయకులు బిర్కెట్ రఘు, సిద్ధూఅయ్యా , అగ్గనుర్ సంకేత్ కాంతు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,
గ్రామస్తులు నర్సింగ్ చౌహన్, పుండరీక్ చౌహాన్, డాల్జీ, నరేష్, అమర్నాథ్, మహేందర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *