తాండూర్ కురుమ ఆణిముత్యలు..

అన్ని రంగాల్లో ఎత్తుకు ఎదగాలి
టీచర్‌ పోస్టులు పొందడం అభినందనీయం
సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
*తాండూరు, అగ్ని జ్వాలా ప్రతినిధి  ఉపాధ్యాయ కొలువులు సాధించిన కురువ ఆణిముత్యాలు ఎల్లప్పుడు అందలంలో ఉండాలని తాండూరు కురుమ సంఘం నాయకులు ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన కురువ సంఘం అభ్యర్థులను సన్మానించారు. బుధవారం రాత్రి కురువ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రగతి కోచింగ్ సెంటర్లో నూతన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. జిల్లాలో ఒకే ఒక్క సంస్కృతం పోస్టుకు ఎంపికైన దోమ శ్రీశైలం(SA), దండు నగేష్ SGT, కంబళ్ళ రాఘవేందర్ SGT, నాగేష్‌ SGT, రాజ్ కుమార్ SGT, బీరప్ప SGT, అశోక్ SGT, శ్రీనివాస్ SA Social, గౌడి సుప్రియ SGT, అభ్యర్థులకు ఘనంవారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గోపాల్ అడ్వకేట్, కురువ సంఘం నాయకులు మాట్లాడుతూ కుల సమాజంలో గొప్ప ఆణిముత్యాలు పుట్టారని అన్నారు. కురువ కులానికి చెందిన అభ్యర్థులు ఉపాధ్యాయ కొలువులు సాధించడం ఎంతో గౌరవమని అన్నారు. ఉపాధ్యాయ రంగంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు తాండూర్ డివిజన్ కుల పెద్దలు, వివిధ గ్రామాల కుల పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *