గ్రామల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

గ్రామల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం*

 

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 

 

నేడు బషీరాబాద్,యాలాల్ మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే.
మైల్వర్ గ్రామంలో బస్ షేల్టర్ కు శంకుస్థాపన.
హాజీపూర్ గ్రామంలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం.

 

మైల్వర్ గ్రామంలో బస్ షేల్టర్ శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. కర్ణాటక సరిహద్దు ప్రాంతం అయిన బషీరాబాద్ మండలంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, ఎన్నికల సమయంలో మైల్వర్ గ్రామానికి బస్ షేల్టర్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు శంకుస్థాపన చేయడం జరుగుతుందని, అలాగే గ్రామంలో ప్రధాన సమస్యలు అయిన డ్రైనేజీ, రోడ్ల ఏర్పాటుకు త్వరలో నిధులు మంజూరు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని అన్నారు.

అలాగే మైల్వర్ గ్రామానికి ప్రధాన చెరువు అయిన అక్కలమ్మ చెరువును గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే తాత్కాలికంగా మరమ్మతులు చేయించడం జరిగిందని, త్వరలోనే అక్కలమ్మ చెరువు సమస్యను పరిష్కరిస్తామని అన్నారు..

వానాకాలంకు సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రాలు త్వరలోనే ప్రారంభిస్తామని, ఈసారి ప్రత్యేకంగా సన్న రకం, దొడ్డు రకం వడ్లకు ప్రత్యేకంగా సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

అనంతరం యాలాల్ మండలం హాజీపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగానే పార్టీ అధికారంలోకి వచ్చిందని, కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, గ్రామాలలో ఇందిరమ్మ కమిటీల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు.

గత ప్రభుత్వం ప్రజలను మెసం చేసి తప్పుడు జీవోలు ఇచ్చిందని, ఆ పనులు చేసిన కాంట్రాక్టర్లు అప్పుల పాలయ్యారని, ప్రస్తుతం మన ప్రభుత్వంలో అలా కాకుండా ఆర్థిక శాఖ ఆమోదంతో పరిపాలనా పరమైన అనుమతులతో నియోజకవర్గానికి సుమారు 230 కోట్ల రూపాయలు రహదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేయడం జరిగిందని, అదే విధంగా త్వరలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు..

*కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో *హాజిపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తో పాటు సుమారు 100 మంది బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.* ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గ్రామంలో అందరూ కలిసి కట్టుగా పని చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని అన్నారూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *