FCR
*తాండూర్ ప్రాంత ప్రకృతి సంపద తో అక్రమ వ్యాపారం.
*- ప్రకృతి సంపదను దోచుకుంటున్న అక్రమార్కులు.
– రాజకీయ నాయకుల చేతిలో బంది గా మారిన ప్రభుత్వ యంత్రాంగం.
-*రాజకీయం అంటే నోట్లు, ఓట్లేనా
*కే. గోపాల్. సీనియర్ న్యాయవాది* కన్వీనర్ Forum for civil rights tandur
తాండూర్ అగ్నిజ్వల ప్రతినిధి
శనివారం (19-10-2024)తాండూరు
తాండూర్ప్ర ప్రాంతం లో ఉన్న ప్రకృతి సంపదతో బడా రాజకీయ నాయకుల అక్రమ దందాలకు పాల్పడుతున్నారని. అడ్డుకోవలసిన ప్రభుత్వ యంత్రాంగం వారి చేతిలో బంది అయందని. తాండూర్ ఫోరం ఫర్ సివిల్ రైట్స్ కన్వీనర్, సీనియర్ న్యాయవాది కే గోపాల్ అన్నారు.
శనివారం ఆయన కార్యాలయంలో అగ్నిజాల ప్రతినిధితో మాట్లాడుతూ తాండూర్ ప్రాంతలోని పకృతి వనరులు ఇసుక ఎర్ర మట్టి శుద్ధ నాపరాయి మొదలగు వాటితో బడా రాజకీయ నాయకులు అక్రమ దందకు తెరలేపారని అన్నారు. ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టాం కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే వడ్డీతో సహా దోచుకుంటామంటే గత నాయకులకు పట్టిన గతి పడుతుందని అన్నారు. తాండూర్ ప్రాంతంలో రోడ్ల సమస్యను పరిష్కరించాలని, స్థానిక యువతకు ఉపాధి కల్పన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఓటర్లు ఎప్పుడు కూడా డబ్బులకు అమ్ముడుపోరని గత ఎన్నికల్లో నిరూపితమైందని వారు తెలిపారు. ప్రజలు ఈ పరిణామాలని జాగ్రత్తగా గమనిస్తున్నారని సమయం వచ్చినప్పుడు సరైన రీతిలో స్పందిస్తారని తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల సోమన్న ప్రజలను చైతన్యం చేసి ప్రశ్నించే విధంగా తమ ఫోరం FCR పనిచేస్తుందని తెలిపారు.

