గర్భిణీ స్త్రీలకు కంజర్ల విజయలక్ష్మి శ్రీమంత కానుక
గర్భిణీ స్త్రీల సంరక్షణయే తమ ధ్యేయం
శ్రీమంతల వేడుకలో కంచర్ల విజయలక్ష్మి
* యాలాల సెప్టెంబర్ యాలాల మండల పరిధిలోని కోకట్ గ్రామంలో కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీమంత కనక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కానుకను కంజర్ల విజయలక్ష్మి అందజేశారు.గ్రామంలో మొత్తం 25 మంది గర్భిణీ స్త్రీలకు గడపగడపకు వెళ్లి శ్రీమంత కానుకను అందజేశారు.ఈ సందర్భంగా కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ అధినేత కంజర్ల విజయలక్ష్మి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల యొక్క సంరక్షణ యొక్క దేయమని పిలుపునిచ్చారు.గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కానుకను అందించడంలో తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజేందర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సంగం మాజీ అధ్యక్షులు అక్బర్ బాబా,మాజీ ఎంపీటీసీ శంకర్,భీమ్ భరత్, ప్రకాష్ గౌడ్,పాండు, భీమ్ భరత్ ,,ఎల్లేష్,అన్వర్ కొకట్ వార్డు సభ్యులు ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

