*ప్రజల సమస్యల పరిష్కారంలో ముందున్న సిబ్బందికి సన్మానం
*వార్డు అభివృద్ధికి అంకితభావం – సిబ్బందికి గౌరవ వందనం
*సీతారాంపేట్‌లో సేవా వీరులకు కౌన్సిలర్ మహేశ్వరి సత్కారం
*ప్రజాసేవలో ముందున్న మున్సిపల్ సిబ్బందికి ఘన సన్మానం
తాండూర్,manasa news ప్రతినిధి: తాండూరు మున్సిపల్ 32వ వార్డు సీతారాంపేట్ కౌన్సిలర్ ఈ. మహేశ్వరి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందిని ఘనంగా సన్మానించడం జరిగింది. ప్రజల సేవలో ఎప్పుడూ ముందుండే జవాన్ రమేష్, జవాన్ సుభాష్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గోపాల్ సేవలను అభినందిస్తూ వారికి శాలువాలు కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ఈ. మహేశ్వరి మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడంలో మున్సిపల్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్షం, ఎండ తేడా లేకుండా సేవలందిస్తున్న వీరి అంకితభావం అభినందనీయం. వార్డు అభివృద్ధి కోసం ఇలాంటి కృషి కొనసాగాలని” కోరారు.స్థానికులు కూడా సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ, ప్రజల పట్ల చూపుతున్న నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

