*గులాబీ జెండా కింద యువత జాతర..! తాండూరులో బీఆర్ఎస్కు బంపర్ బలం
*గ్రామాల నుంచి గులాబీ వైపు యువత భారీ తరలింపు!
*విద్యార్థుల చేరికతో గులాబీ శక్తికి డబుల్ పవర్!
*యువతే బలం.. బీఆర్ఎస్లోకి విద్యార్థుల ధూమ్ ఎంట్రీ!
*NSUI నుంచి BRS వైపు యువశక్తి అడుగు..!
*గులాబీ దళానికి యువత గర్జన.. రోహిత్ రెడ్డి సమక్షంలో భారీ చేరిక!
*యువశక్తి బీఆర్ఎస్ వైపు.. పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో విద్యార్థుల ఘన చేరిక
తాండూర్ manasa news ప్రతినిధి :తాండూర్ ఈరోజు జరిగిన కార్యక్రమంలో NSUI నాయకుడు మజర్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీలో ఘనంగా చేరారు. పైలెట్ రోహిత్ రెడ్డి గారు వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ, యువత భాగస్వామ్యంతో పార్టీకి కొత్త ఉత్సాహం, కొత్త శక్తి వస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆలోచనలు, వారి చైతన్యం సమాజ మార్పుకు కీలకమని తెలిపారు. పార్టీ బలోపేతానికి విద్యార్థుల పాత్ర అత్యంత ప్రాముఖ్యమైందని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.విద్యార్థుల ఈ భారీ చేరికతో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని, రాబోయే రోజుల్లో యువతే పార్టీకి అగ్రశక్తిగా నిలుస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు

