*దళిత, బీసీ, మైనార్టీ హక్కుల కోసం ఐక్య నిరసన
*న్యాయం కోసం గళమెత్తిన తాండూర్ ప్రజలు
*అగ్రకుల అహంకారానికి బలి అయిన పసిబిడ్డ… న్యాయం ఎప్పుడు?
*నాగర్ కర్నూల్ ఘటనపై తాండూర్‌లో నిరసన
*కుల వివక్ష హత్యలపై కఠిన చర్యలు తీసుకోండి
*ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు ఆపాలి – ప్రభుత్వానికి హెచ్చరిక
*కుమ్మేర్ ఘటనపై ఖండన… సీఎం వెంటనే స్పందించాలి
తాండూర్,manasa news ప్రతినిధి :తాండూర్ పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు MRPS తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర్ జాతర లో చాకలి కుటుంబంకి చెందిన 2 నెలల పసికందు పై అగ్రకుల పెత్తందారులు అగ్రకులదురంకారులు కాళ్లతో తన్ని హత్య చేసిన అగ్రకుల పెత్తందారులు నేటికీ కుల వివక్ష అంటరానితనం ఎస్సీ ఎస్టీ బీసీలపై అణిచివేత అక్రమాలు దౌర్జన్యాలు కుల దురంకార అహంకారంతో హత్యలు దాడులు చెయడాన్ని తీవ్రంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఖండించడం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఇలాంటి కుల దురంకారాలు హత్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం కొత్తూరు చంద్రయ్య కే ఎన్ పి ఎస్ జిల్లా నాయకులు గుమ్మడి రత్నం తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి తాండూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి సాదిక్ మరియు సంయోద్దీన్ ఆర్ఎంపీ డాక్టర్ మగ్దూం గౌస్ ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు బలరాం మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తానేష్ మాదిగ

