ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఆరు సబ్ స్టేషన్లకు 29న దౌలాపూర్ గ్రామంలో భూమిపూజ, శంకుస్థాపన
—29న తాండూర్ కు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాక
అగ్నిజ్వాలా ప్రతినిధి:తాండూర్
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజక వర్గం యాలాల మండలం దౌలాపూర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఆరు సబ్ స్టేషన్లకు జూలై 29వ తేదిన మంగళవారం స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డంప్రసాద్కుమార్హాజరుకానున్నారు. ఈ సందర్బంగా దౌలాపూర్ గ్రామంలో భూమి పూజ నిర్వహించే స్థలాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు సందర్శించి, పరిశీలన చేశారు.సందర్శించిన వారిలో సీనియర్కాంగ్రెస్ నాయకులు కలాల్ చంద్ర శేఖర్ గౌడ్, విద్యుత్ శాఖ ఎస్ ఈ రవి ప్రసాద్, డి ఈబాను ప్రసాద్, ఏడిఈఅర్జున్ కుమార్, ఏడిఈశంకర్, ఏఈ రఘు వీర్ రెడ్డి ,కాంగ్రెస్ నాయకులు నర్సిములు, తదితర సిబ్బంది ఉన్నారు.