దౌలాపూర్ గ్రామ పంచాయతీలో 230 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
–కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు – కలాల్ చంద్రశేఖర్ గౌడ్
అగ్నిజ్వాలా ప్రతినిధి:తాండూర్
ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే తమ్మన్న రామ్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సహకారంతో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి ఫలితంగా నియోజకవర్గ పరిధి యాలాల్ మండలం దౌలాపూర్ గ్రామ పరిధిలో నియోజకవర్గానికి మంజూరైన ఆరు నూతన విద్యుత్ సబ్ స్టేషన్ లకు , యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి భూమి పూజతో పాటు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు చేయనున్నారు. ముందుగా మండల పరిధిలోని జంటుపల్లి శ్రీ సీతారామస్వామి దేవాలయంలో పూజలునిర్వహించనున్నారు .అనంతరం తాండూర్ శివారులోని కందనెల్లి జిపిఆర్ గార్డెన్ లో నిర్వహించే సభలో పాల్గొననున్నారూఈ కార్యక్రమానికి తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, యాలాల మండల ప్రజాప్రతినిధులు, ఆయా మండలాలకు చెందిన నాయకులు, పట్టణ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు,అభిమానులు, యూ త్ కాంగ్రెస్ నాయకులు,ఎన్ ఎస్ యూ ఐ, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు బీసీ ఎస్సి ఎస్టీ మైనారిటీ సెల్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రజలు భారీసంఖ్యలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సీనియర్ నాయకులు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.