అగ్నిజ్వాల ప్రతినిధి తాండూర్
యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన హరిజన్ జోష్ణ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటుగా రూ.1,10,000 విలువైన ఎల్ఓసి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మంజూరు చేయించి, వారి కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు.ఈ కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్, నర్సింలు, కళాల్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారూ

