బీసీ గురుకులాలలో సీట్లు పెంచాలి

*రాజ్ కుమార్ నేతృత్వంలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాల సందర్శన

 

*బీసీ గురుకులాలలో సీట్లు పెంచాలి

*సీట్లు దొరకక వందలాది మంది విద్యార్థులు అవస్థలు

*బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలి

*ప్రస్తుత అద్దె భవనంలో పహారి గోడ డైనింగ్ ఆల్ నిర్మించాలి

జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్

అగ్ని జ్వాల ప్రతినిధి :తాండూర్

బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో సీట్లు పెంచాలని వేల సంఖ్యలో విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్ల కోసం ఎదురు చూస్తుంటే కేవలం వందల సంఖ్యలో మాత్రం విద్యార్థులు సీట్లు దొరుకుతున్నాయని అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్లు పెంచాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారుశనివారం మధ్యాహ్నం హైదరాబాద్ రోడ్డు లో గల మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఇతర బీసీ నేతలతో కలిసి సందర్శించారు పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి పాఠశాల వసతి,భవనాలు సీట్ల పరిమితి వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు బీసీ విద్యార్థులకు అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలో 50 శాతం సీట్లు పెంచాలని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల కోసం సొంత భవనాలను నిర్మించాలని ప్రభుత్వానికి కోరారు రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరియైన సదుపాయాలు లేవని వెంటనే సంబంధిత బిల్డింగ్ ఓనర్స్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని విద్యార్థులకు తినడానికి సరియైన వసతులు లేక గ్రౌండ్లో కూర్చుని తింటున్నారని అందుకు వారికి డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలని భవనం రెండో అంతస్తులు రేకుల షెడ్ ఉండడం ద్వారా వర్షాకాలం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీటిని సరి చేసే బాధ్యతను ప్రభుత్వ ఉన్నత అధికారులు తీసుకోవాలని కోరారుబీసీ రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన వారిలో బీసీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ సుకుర్ జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేష్ యాలాల మండల బిసి అధ్యక్షులు లక్ష్మణ చారి పెద్దముల్ మండల బిసి యువజన సంఘం అధ్యక్షులు నవీన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్ బిసి యువ నాయకులు రాజు గౌడ్ వివేక్ మరియు ప్రిన్సిపాల్ నరేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *