ఈనెల 23న విద్యాసంస్థలు బంద్ 

 

ఈనెల 23న విద్యాసంస్థలు బంద్ 

విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలి

విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 23 న విద్యా సంస్థల బంద్

అగ్నిజాల ప్రతినిధి: వికారాబాద్ జిల్లా

విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 23 న విద్యా సంస్థల బంద్ ను విజయ వంతం చేయండి – SFIప్రభుత్వ విద్యా రంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమిద్దాంఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బంది గా అమలు చేయాలిప్రభుత్వ పాఠశాల కలశాల లో మౌలిక సదుపాయాలు కల్పించాలిSFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ దామెర కిరణ్ ఈ రోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో SFI ఆఫీసులు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 23 వాపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బంద్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు, జిల్లా కార్యదర్శి అక్బర్ జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం అందించాలని విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపించడం లేదని విమర్శించారు, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై ఉన్న ప్రేమ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలపై ప్రభుత్వానికి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు, ఎవరికివారు వారి ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మార్చుకొని స్టేషనరీ వస్తువు లు సైతం పాఠశాలలోనే విక్రయిస్తూ విద్యా వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల తీరు కనిపిస్తుంది,23 న జరిగే బంద్ కు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి అనిల్ జిల్లా కమిటీ సభ్యులు రాకేష్ అభిషేక్, శ్రీధర్ సిద్దు రేహాన్ చరణ్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *