ఘనంగా తాండూర్ లయన్స్ క్లబ్ 51వ ఇన్స్టాలేషన్ సెర్మనీ

—తాండూర్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా శరణు బసప్ప..
అగ్నిజ్వాల ప్రతినిధి తాండూర్
తాండూర్:తాండూర్ లయన్స్ క్లబ్ 51వ ఇన్స్టాలేషన్ సెర్మనీ కార్యక్రమం ఆదివారం ఘనం గా నిర్వహించారు. వికారా బా ద్ జిల్లా తాండూర్ పట్టణం లోని సల్లా గార్డెన్ లో తాం డూర్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా శరణు బసప్ప తో పాటు నూతన కార్యవర్గం2025-26 సంవత్సరానికి గాను ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తాండూర్ డిఎస్పీ బాలకృష్ణా రెడ్డి, పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు హాజరైనారు.కోఆర్డినేటర్ గా రొంపల్లి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షు లుగా మురళి మోహన్ నామాజీ, మహమ్మద్ యూసుఫ్, వరప్రసాద్,కార్యదర్శిగా మంకాల్ నటరాజ్, ట్రేజరర్ గా గౌరీ శంకర్ లతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసారు. నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ అధ్యక్షులు శర ణు బసప్ప మాట్లాడుతూ..తమ సేవలను అందించడానికి ప్రతిజ్ఞ చేయడంతో పాటు సమాజానికి సేవ చేయడానికి కట్టుబడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, పలు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

