పార్టీ కోసం ధారాసింగ్ అందిస్తున్న సేవలను గుర్తించి మరోసారి టీపీసీసీ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యరు
పెద్దేముల్ మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్‌కు మరోసారి చోటు దక్కింది.
పీసీసీలోనూ బడుగువర్గాల వారికి ప్రాధాన్యం
అగ్ని జ్వాలా ప్రతినిధి:తాండూర్
తాండూరు నియోజకవర్గంకు చెందిన సీనీయర్ నేత, పెద్దేముల్ మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్‌కు మరోసారి చోటు దక్కింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయనకు మరోసారి అదే పదవిలో అవకాశం కల్పించారు.మత్రివర్గ విస్తరణలో మాదిరి పీసీసీలోనూ బడుగువర్గాల వారికి ప్రాధాన్యమిచ్చారు. పదవుల భర్తీలో విధేయత, సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్నవారి వివరాలను జిల్లాలవారీగా సేకరించి ఈ పదవులకు ఎంపికచేశారు. పార్టీ కోసం ధారాసింగ్ అందిస్తున్న సేవలను గుర్తించి మరోసారి టీపీసీసీ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

