తాండూరు డిఎస్పి కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న దళిత ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి అగ్రకుల పెత్తందారులకు కొమ్ముకాస్తున్న తాండూర్ డీఎస్పీ పైన చర్య తీసుకోని సస్పెండ్ చేయాలనీ ప్రజా సంఘాల డిమాండ్
అగ్ని జ్వాలా ప్రతినిధి:తాండూర్
ఈరోజు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూర్ డిఎస్పి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా *సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ తాండూర్ మండలం బెల్కటూర్ గ్రామంలో దళిత యువకుడి పెండ్లి బరాత్ అడ్డుకొని కులం పేరుతో దూషించిన వారిని అరెస్టు చేయాలనీ తాండూరు డిఎస్పి కార్యాలయం ముందు ధర్నా నిర్వాయించడం జరిగింది తాండూర్ డిఎస్పి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గి అగ్రకుల పెత్తందారులను అరెస్టు చేయకుండా అగ్రకుల పెత్తందారులకు కొమ్ముకాస్తున్న తాండూర్ డిఎస్పి పై చర్య తీసుకొని వెంటనే సస్పెండ్ చేసి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ తెలంగాణ శాసనసభ స్పీకర్. గడ్డం ప్రసాద్ గారి సొంత గ్రామంలో దళితులకు ఆలయ ప్రవేశం లేకపోవడం. దళితులు పెళ్లి చేసుకొని భరత్ నిర్వహిస్తున్న సమయంలో అగ్ర కులస్తులు అడ్డుకోవడం. చాలా దుర్మార్గమని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలోని కుల వివక్ష అంటరానితనం దళితులపై దాడులు. జరగడం సిగ్గుచేటు ఇప్పటికైనా. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు జిల్లా కలెక్టర్ గారికి. జిల్లా ఎస్పీ గారికి ఆదేశాలు జారీ చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాము*. తాండూరు మండలం బెల్కటూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు వినయ్ కుమార్ మే నెల 18న వివాహం చేసుకొని అదే రోజు భరత్ ఊరేగింపు చేస్తున్న సందర్భంలో దళిత పెళ్లి కుమారుడిని. పెండ్లి భరత్ ఊరేగింపు అడ్డుకొని దళితులపై దాడి చేసిన అగ్రకుల పెత్తందారులను. వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెల్కటూరు గ్రామంలో మే 18న దళిత కులానికి చెందిన నవీన్ కుమార్ వివాహము జరిగింది అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆ గ్రామంలోని హనుమాన్ టెంపుల్ నుంచి పెళ్లి బరాత్ ఊరేగింపు చేస్తున్న సందర్భంగా అదే గ్రామానికి చెందిన కొంతమంది అగ్రకుల పెత్తందారులు పెళ్లి భరత్ ను అడ్డగించి తక్కువ కులానికి చెందిన మీరు మా అగ్రకుల వాడలో బరాత్ తీస్తారా అని బరాత్ ను అడ్డుకొని కులం పేరుతో దూషించి దాడి చేసిన అగ్రకుల దురాహంకారులను వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టం కింద నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న మెరిసిపోతున్న తెలంగాణ అని రేవంత్ రెడ్డి ఇంకోవైపు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా మన రాష్ట్ర గౌరవ అసెంబ్లీ స్పీకర్. ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం ప్రసాద్ గారు పుట్టిన సొంత గ్రామంలో దళితుల వివాహం ఊరేగింపు చేసుకొని దురదృష్టం ఉన్నది దళితులకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం 17 ప్రకారం కుల వివక్ష నిషేధం 21 ప్రకారం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కులను అగ్రకుల పిత్తందారులు కాలరాస్తున్న ప్రభుత్వం పోలీస్ అధికారులు అరెస్టు చేయకపోవడం విడ్డూరము అన్నారు ఘటన జరిగి 15 రోజులు గడుస్తున్న నేటికీ ఆ గ్రామాన్ని సబ్ కలెక్టర్ సందర్శించకపోవడంపై అధికారులపై పలు అనుమానాలకు తావు ఇస్తుందన్నారు ఆ గ్రామంలో దళితులకు నేటికీ దేవాలయ ప్రవేశం లేదు ఆ గ్రామంలో కుల వివక్ష అంటరానితనం దళితులపై దాడులు దౌర్జన్యం. నిరంతరం కొనసాగుతున్న ఆ దళితులు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన. పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్. ఎస్పీ ఆ గ్రామాన్ని వెంటనే సందర్శించి బాధితులను పరామర్శించి దళితులకు దేవాలయ ప్రవేశం. నిందితులను అరెస్టు చేయాలని చేశారు తాండూరు డిఎస్పి కార్యాలయం ముందు. ధర్నా చేస్తున్న ప్రజా సంఘాల నాయకులను అక్రమ అరెస్టులు చేయడానికి తీవ్రంగా ఖండించారు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం కెవిపిఎస్ ఎమ్మార్పీఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం. జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య కెవిపిఎస్ జిల్లా నాయకులు సురేష్ సిఐటియు మండల నాయకులు సురేష్ ప్రజాసంఘాల నాయకులు నవీన్ నగేష్ ఆనంద్ అశోక్ ప్రవీణ్ ఎం నవీన్ కుమార్ మధు బిచ్చప్ప మహేష్

