త్వరలో తాండూరుకు మరో మూడు డీసీసీబీ బ్యాంకులు ప్రారంభిస్తాం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

త్వరలో తాండూరుకు మరో మూడు డీసీసీబీ బ్యాంకులు ప్రారంభిస్తాం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

అగ్నిజ్వాల ప్రతినిధి : యాలాల్ 

యాలాల్ మండలం లక్ష్మీ నారాయణపూర్ గ్రామంలో ది హైదరాబాద్ జిల్లా సహకర కేంద్ర బ్యాంకు(HDCCB) లక్ష్మీనారాయణపూర్ నూతన శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో డీసీసీబీబ్యాంకులుపట్టణాలకేపరిమితం అయ్యేవి. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మారుమూల గ్రామాల రైతులకులబ్దిచేకూర్చాలని నాబార్డ్ వారిని సంప్రదించి, లక్ష్మీనారాయణపూర్ కు బ్యాంకు తీసుకురావడం తీసుకురావడం జరిగిందని అన్నారు తాండూరులో రైతుల డిమాండ్ మేరకు త్వరలో మండలానికి ఒకటి చొప్పున డీసీసీబీ బ్యాంకును ప్రారంభించే విధంగా కృషి చేస్తాం. బ్యాంకు సబ్సిడీ ద్వారా వ్యాపారాలు, వ్యవసాయ అభివృద్ధికి, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. రైతులు ప్రైవేటు బ్యాంకులను సంప్రదించకుండా, డీసీసీబీ బ్యాంకులను సద్వినియోగం చేసుకొవాలి. రైస్, దాల్ మిల్లులు నిర్మించుకునే వారికి సబ్సిడీ ఋణాలు అందిస్తాం.. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సత్యయ్య , డీసీసీబీ డైరెక్టర్ లు, సొసైటీ చైర్మన్ లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ప్రజాప్రతినిధులు నాయకులు, అధికారులు ఉన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *