కందనెల్లి మెథడిస్ట్ చర్చి ప్రహరీ గోడ పనులు ప్రారంభం 

కందనెల్లి మెథడిస్ట్ చర్చి ప్రహరీ గోడ పనులు ప్రారంభం 

హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు 

క్రిస్టియన్ మైనార్టీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

తాండూర్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు కిరణ్

అగ్నిజ్వల ప్రతినిధి: పెద్దేముల్

తాండూర్:వికారాబాద్ జిల్లా పేదేముల్ మండలం

కందనెల్లి గ్రామ మెథడిస్ట్ చర్చ్ ప్రహరీ గోడ పనులకు క్రిస్టియన్ మైనార్టీ ఫండ్ ద్వారా ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.5 లక్షలు తో అభివృద్ది పనులను ప్రారంభించడం జరిగిందని

తాండూర్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు కిరణ్అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. పార్టీలకతీతం గా పనిచేసే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అదేవిధంగా తాండూర్ నియోజకవర్గంలోని గ్రామాల క్రిస్టియన్స్ మైనారిటీల సమస్యలను దశలవారీగా ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఈ సందర్భంగా డి ఎస్ జనార్ధన్, గ్రామస్తులు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మెథడిస్ట్ చర్చి ప్రహరీ గోడ పనులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హయంలో జరగడం ఎంతో సంతోషకరమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అబ్రహం పాస్టర్, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి ,శ్రీనివాస్ చారి ,నారాయణరెడ్డి, లయఖత్ అలీ ,ఎండి సర్దార్, ఎండి వాజిద్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *