సిపిఎం మహాసభలు జయప్రదం చేయండి

2025 జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరిగే సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి సిపిఎం                             

తాండూర్ :అగ్నిజ్వల ప్రతినిధి 

17/01/2025  తాండూర్ పట్టణం లో రాష్ట్ర మహాసభల పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం వికారాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ* ….ఉద్యమాల దిక్సూచి, పోరాటాల సారధి, కష్టజీవుల గొంతుక సిపిఐఎం. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలు సమస్యలో కొట్టుమిట్టాడుతున్న అక్కడ ఆ ప్రజల పక్షాన నికరంగా నిలబడే పోరు కెరటం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు. కష్టజీవుల పార్టీ సిపిఐఎం తెలంగాణ నాలుగవ రాష్ట్ర మహాసభలు జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి పట్టణం జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం గడిచిన ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. కొలువులు రాక నిరుద్యోగ యువత ఎదురుచూపులు చూస్తోంది. కూలీలు అసంఘటితరంగా కార్మికుల బతుకులు దయనీయంగా ఉన్నాయి. కౌలు రైతులను గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు.వృత్తి దారులు సమస్యల ఊబిలో కురకు పోతున్నాయి. ఒకరేమిటి అన్ని రంగాల ప్రజల సంక్షోభంలో ఉన్నారు నిరంకుశంగా పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించి ఆరు గ్యారంటీలు, అనేక వాగ్దానాలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రభుత్వ మారింది తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. పేదలు తలదాచుకోవడానికి జానుడు జాగలేక అల్లాడిపోతుంటే ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసింది సిపిఎం. నేటికీ అనేక జిల్లాలో పోరాడుతున్నది. భూ పోరాటం నడిపింది. ప్రభుత్వ భూములను పేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీసింది. నిర్వాసితులకు అండగా నిలిచింది. లగచర్లలో ప్రజల పక్షాన నిలిచి విజయం సాధించింది. గిరిజనులకు వెన్నుదన్నుగా నిలిచింది. పోడు సాగుదారు హక్కు పత్రాల సాధన పోరాటంలో అగ్రభాగాన నిలిచింది సిపిఎం. ఆదివాసుల అడవి హక్కులకై పోరాటం చేసింది. కార్మిక హక్కుల రక్షణ కోసం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు కోసం, రైతన్నకి ఇచ్చిన హామీల అమలు కోసం, అందరికీ ఉచిత ఆరోగ్యాన్ని అందించే ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం, వ్యవసాయ కూలీల, ఆసoగటిత రంగా కార్మికుల కనీస వేతనాల చట్టాల అమలు కోసం, ప్రజలను సమీకరించి ఉద్యమాల సారథి సిపిఎం నిలబడింది. కేంద్రంలో మోడీ సర్కార్ తన నూతన ఆర్థిక విధానాలు తీసుకువచ్చింది. రైతన్నలను ఇబ్బంది పెడతా ఉంది. కార్పొరేట్లకు ఊడిగం చేస్తుంది మోడీ సర్కార్ అంబానీ ఆదానిలకు సర్కారుగా మారింది. ప్రజలను ఇక్కట్లు ఇబ్బందుల గురిచేస్తున్నారు. వికసిద్ భారత పేరుతో పేదలనే కాకుండా మధ్యతరగతి ఉద్యోగులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు దేశాన్ని అవినీతి పాలకులు కబలిస్తున్నారు. *ప్రజల భాగస్వామ్యంతో సిపిఐఎం ప్రజా ఉద్యమాలను, మహాసభలను జయప్రదంగా నిర్వహిస్తున్నది. అందరం కలిసి నడుద్దాం. ప్రజా పోరాటాలను నిర్వహిద్దాం. మంచి భవిష్యత్తును భావితరాలకు అందిద్దాం. ప్రజల కోసం పోరాడే సిపిఐ ఎం పార్టీకి అండగా నిలుద్దాం. సిపిఐఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ప్రజా ఉద్యమాలను బలపెట్టం చేయండి* అన్నారు ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో సిపిఎం నాయకులు యాదయ్య వెంకటేష్ దస్తప్ప సతీష్ శివ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *